సమస్యాపూరణం;-మచ్చ అనురాధ
 ధరణి వరంబులీయగ విధాత జనించె వివేకవంతుడై .
======================================
వరుణుడు హర్ష మొంద పలు వానల తోడ తటాకముల్ నదుల్
పరుగులు దీయ పొంగుచును  పారగ నేరులు  నేకమై యిలన్
తరగని నీటిసంపదలతావల మై భువి శ్రీలుపండు నీ
ధరణి వరంబులీయగ విధాత జనించె వివేకవంతుడై .


కామెంట్‌లు