ఆషాడబోనాలు; -సాహితీసింధు సరళగున్నాల
తలకునూనెలంటి తలదువ్వి పువ్వులన్
తురిమిగుడికినేగు త్రోవగనుచు
నింతు లెల్ల గూడి సంతసమ్ముతోడ
దేవిపూజ జేసి దీవెనందు

పసుపు కుంకుమ ,గంధమ్ము ఫలములన్ని
ఓడిబియ్యము కుడుకలు నొడినినింపి
దూప దీపమ్ము నైవేద్య తోరణముల
దేవిపూజల జేసియు దీవెనకయి

కామెంట్‌లు