సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
  రాలేనివి... వీడిపోనివి..
    *****
మన జీవితంలో ఎంత వగచినా తిరిగి రాలేనివి  గతకాలపు రోజులు. కాలం నదిలా ముందుకే ప్రవహిస్తుంది. మనమూ కాలంతో పాటు నడిచే జీవనదులమే....
అందుకే నడిచే దారిలో ముళ్ళున్నా రాళ్ళున్నా కొండలు గుట్టలు అడ్డు వచ్చినా నదిలా ఒదిగి పోవాలి కానీ ఎక్కడా ఆగిపోకూడదు.మనకు, మనతో కలిసి రాలేని వాటి గురించి ఆలోచించ కూడదు.
అలాగే మనల్ని ఎప్పుడూ వీడిపోనివి జ్ఞాపకాలు. జీవిత నది చివరికి అనంత సాగరంలో కలిసేంత వరకు   తోడుగా వచ్చేవి మంచి,చెడుల అనుభవాలే. మనం చేసిన మంచిపనుల స్మృతుల పరిమళాలే..
వీడిపోలేని గతం గుర్తులలో మననం చేసుకోవాల్సినవి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే మంచి జ్ఞాపకాలే...
 రాలేనివి వదిలేద్దాం.వీడిపోలేని మంచితనాన్ని మన వెంట తీసుకుని వెళ్దాం. 
 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు