సుప్రభాత కవిత ; -బృంద
బ్రతుకుదారి సుగమమే
నమ్మకం నడిపిస్తుంది.

అడ్డులేవి ఆపలేవు..
అవసరం దారి చూపుతుంది.

కలతల ఎండ బాధించదు
చల్లని మనసు ఊరడిస్తుంది.

వేధించే వేదనలు  ఓడిపోతాయ్
సత్సంకల్పం  గెలిపిస్తుంది.

గగనమే  నీడగా
భువనమే పరుపుగా
మనశ్శాంతి కంటికి నిద్రనిస్తుంది

నిరాశ ఎన్నటికీ దరిచేరదు
నమ్మకం  గమ్యాన్ని చేరుస్తుంది.

అడుగులు ఎన్నడూ అలుపనవు.
గెలుపుపై కసి  నడిపిస్తుంది

రేపటిపై ఆశ....ఒక్కటుంటే
ఈనాటి కష్టాలు బాధించవు

నమ్మకాన్ని నిలిపి నడిపించే
నవ్య భావనలు  మనసు నింపే
ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు