కనుచూపుమేర;-(సైన్స్ యాత్రా కథనాలు);- డా. కందేపి రాణి ప్రసాద్
 సృజనాత్మకతే తన జీవితంగా మార్చుకున్న వ్యక్తి దృష్టి కోణంలో పర్యాటక ప్రదేశాలు చూసినప్పుడు వాటి వైశాల్యం మరంత ఎక్కువగా కనబడుతుంది మనుషుల్ని అర్థం చేసుకునే సహజ లక్షణం సంయమనంతో లోకాన్ని పరికించే సహనం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య వీటితో పాటు సుదీర్ఘకాలపు సాహిత్య సృజన చేస్తున్న సృజనశీలి డా.కందేపి రాణి ప్రసాద్ పిల్లల రచనా వ్యాసంగంలోకి వచ్చిన ఆమె బాలసాహితి వేత్తగా పేరు తెచ్చుకున్నారు 
ఎన్నో పుస్తకాలు రచించిన ఈమె ఇటీవలే హౌస్ వైఫ్ కవితా సంకలనం కోయంబత్తూరులోని ఓ మెడికల్ కాలేజీ కోసం ప్రత్యేకం కట్టిన బ్రిడ్జి వివరాలు తెలియాలంటే అక్కడికి వెళ్లాల్సిందే అనే అనుభూతి మనకు కలగకమానదు

సిటీ ఆఫ్ టెంపుల్స్ గా పేరుగాంచిన ఉజ్జయిని గురించి ప్రతి చిన్న విషయాన్ని వదలకుండా తెలియజేశారు అంతే కాకుండా కాళిదాసు గురించి చాల విషయాలను ప్రస్తావించిన రాణి ప్రసాద్ మహా కాళేశ్వర్ ఆలయం పక్కనే ఉన్న విక్రమార్కుడి సింహాసనం గురించి సాలబంజికల ప్రచురించారు దానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం కూడా అందుకున్నారు ఆమెకు యత్రాలు చేయడమన్నా ప్రదేశాన్ని పదిమందికి పరిచయం చేయడమన్నా అమితమైన ఇష్టం విహార యాత్రలకు సంబంధించి రాణి ప్రసాద్ కలం నుంచి వెలుగు చూసిన రెండో పుస్తకమే  ఈ కనుచూపుమేర
సరళంగా ,సూటిగా ,పదునుగా ఉంటుంది కందేపి రాణి ప్రసాద్ రచానా  శీలి ఏ రచనని ఎక్కడ ఎలా మొదలు పెట్టాలో తెలిసిన ప్రతిభశాలి ఆమె ఆ సృజనాత్మక  ప్రతిభను తారా స్థాయిలో అభివ్యక్తం చేసిన రచన ఈ యాత్ర కథనాలు తొలి అధ్యాయాన్ని చదివితే ప్రకృతి ఒడిలో తెలియని పరవశానికి లోనైన అనుభూతి పాఠకులకు కలుగుతుంది ఎందుకంటే అది ప్రకృతి అందాలకు పుట్టినిలైనా కేరళ గురించి కావడం ఆ తర్వాత ఒక్కొక్కటి చదువుతుంటే ఆ ప్రదేశాలను చూడలనిపించే కుతూహలం కలగక మానదు ఇరవై ఒక్క ప్రదేశాల గురించి ఇష్టంగా ,ప్రేమగా పిల్లలకు అర్ధమయ్యే రీతిలో రాశారు ఇరవై ఒక్క కథనాలల్లో ఒక అయిదు తప్ప మిగతవన్నీ మన దేశంలోనివే కావడం వల్ల అనుకుంటా ఈ పుస్తకానికి కనుచూపుమేర అని పేరు పెట్టారు
కేరళ అందాలను పెద్దలకు ఓ తీరుగా చెబితే పిల్లల కోసం ఎలిఫెంట్ కాంప్ పేరుతో మరో వ్యాసం రాశారు దానిలో గురువాయిరు లో గల ఎలిఫెంట్ కాంప్ గురించి వివరించారు 'నీలి నీల అలల ముంబయి' పేరుతో ముంబయి నగర అందాలను వివరించారు 'రాజీవ్ సిలింక్ బ్రిడ్జి'ను చూపిస్తూ కలకత్తా లోని 'హౌరా బ్రిడ్జి'ని
గుర్తు చేయడంతో పాఠకులకు రెండు చూడాలనే ఆసక్తి కలుగుతుంది అదేవిదంగా ముంబయి లో గల నెహ్రు సైన్స్ సెంటర్ లైట్ అండ్ సైట్ ఎగ్సిబిషన్ అందాలు ఆంద్రమహాసభ విశేషాలు ఆసక్తి కరంగా వివరించారు
చెన్నై పర్యటన దాదాపు పెడికాన్ చుట్టూ తిరిగినా పాఠకులకు ఓ డాక్టర్స్ వర్కషాప్ ని పరిచయం చేసినట్లుంది మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియాగా పంప్ సిటీ గా పిలవబడే కోయంబత్తూర్ విశేషాలను కండ్లకు కట్టినట్టు వర్ణించారు
కథలను గురించి రేఖా మాత్రంగానైనా ప్రస్తావించి ఉంటే ఇంకా సమగ్రంగా ఉండేది ఆరంజ్ సిటీ గా పేరుగాంచిన
నాగపూర్ విశేషాలు ఇండోర్ అందాలను చూడవచ్చు జగన్నాధ క్షేత్రంగా పేరుపొందిన భువనేశ్వర్ విశేషాలను తెలుసుకుంటే పింక్ సిటీ అయిన జైపూర్ అందాలను ఆనందగా మదిలో పదిలపర్చుకుంటారు దేశంలోనే పేరుగాంచినా రాజాదినకర్ కేల్కర్ ఛత్రపతి శివాజీ మహరాజ్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ హిస్టరీ మహాత్మా పూలె , బాబా సాహెబ్ అంబేత్కర్ మొదలైనా మ్యూజియం ల విశేషాలను తెలుసుకోవచ్చు
చెండిఘర్ లోని రోజ్ గార్డెన్ విశేషాలను చదువుతుంటే ఆ గులాబీల అందాలను కండ్లరా చూడాలనే అనుభూతి కలుగుతుంది సహజంగా వ్యర్థలతో కళాకృతులు చేసే రాణి ప్రసాద్ కి రాక్ గార్డెన్ లోని నేక్ చెంద్ సృష్టించిన కళాఖండాలు ఆమెకు సరికొత్త టాస్కులను ఇచ్చే ఉంటాయి ఇంకా ఈ సంపుటిలోని రంగణతిట్టు పక్షి వివరాలు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర్ దర్శనం .మంగళూర్ సోయగాలు ,అండమాన్ జైలు విశేషాలు చదువుతుంటే
భారతదేశాన్ని చుట్టి వచ్చిన అనుభూతి కలుగుతుంది
దేశ సరిహద్దులు దాటి దక్షిణాఫ్రికా ఆస్ట్రిచ్ అందాలు థాయిలాండ్ విశేషాలు స్విట్జర్లాండ్ సోయగాలు ఈఫిల్ టవర్ చైనా మహకుడ్యం అందాలను చుట్టి రావొచ్చు అలాగే ఈ పుస్తకం లో సైన్సు విద్యాపరమైనా విశేషాలతో పాటు ఏ ఏ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి అనే వివరాలను తెలుసుకోవచ్చు ముఖ్యంగా పెడికాన్ సమావేశాల విశేషాలతో పాటు దర్శినీయ ప్రదేశాల వివరాలను తెలుసుకుంటారు 
మొత్తానికి " కనుచూపుమేర" తో కలిసి ప్రపంచాన్ని చుట్టి వచ్చిన పాఠకులకు ఇదో సైన్స్ యాత్రగా అనిపిస్తుంది 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం