సుప్రభాత కవిత ; -బృంద
నిదురకాచి ఎదురుచూచు
మనసుకెంత ఊరట....

కోరక దొరికిన కొత్తదారుల
పరుగెత్తాలని తుళ్ళిపడే 
మనసుకెంత  ముచ్చట.

తొలికిరణాల  స్పర్శలో
తరించిపోవాలని మబ్బుల తచ్చాట

పులకరించిన పుడమితల్లి
చుట్టుకున్న పట్టుచీర ఆకుపచ్చట!

చల్లగ తాకి కుశలమడిగి
మురిపించే 
భలే కదా గాలి అచ్చట...

వెలుగు తెచ్చు కిరణాలు
తాకిన అణువణువూ నునువెచ్చనట!

బంగరు రంగులు పొంగిన
ఉదయం  మోస్తూ తెస్తోంది
సంతోషాల మూట.

మనసు మురియగ చెబుతున్నా
మీకందరికీ
ఒక మంచి మాట......

🌸🌸  సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు