కష్టే ఫలి ; -ఎం. వి. ఉమాదేవి
 ఏ నిముషానికి ఏమి జరుగునో 
ఎవరూహించెదరూ... 
అని ఓ కవిగారి మాటలు 
అదే విధంగా సాఫీగా సాగేబతుక్కు 
ఒడిదుడుకుల అడ్డుగానూ.. 
తననునమ్మి తనపైన ఆధారపడ్డవారికి ఆసరాగా 
జీవితభీమా,గృహ బీమా, వాహనబీమాలు 
ఎంతో ఊరట స్థిమితమిచ్చే పద్దతి !
మనిషి మరణానికి కుటుంబం కన్నీరు తుడిచే చేయూత!!
ఇవాళకాసులు కుప్పల వ్యాపారమే 
రేపటికి కుప్పకూలిన పరిస్థితిలో 
భరించలేని నష్టాన్ని బీమా పంచుకుంటున్నది 
సరైన ఆధారాలు,సమర్పించిన ఋజువులిస్తే 
భుజంతట్టి ముందుకుపొమ్మనే బీమా నిధి 
సామాన్యులు,సంపన్నులకూ సాటిలేని పెన్నిధి !!

కామెంట్‌లు