బోనాలు ;-ఎం. వి. ఉమాదేవి
అమ్మవారికి నైవేద్యాలు 
ఆషాడంలో బోనాలు 
అయా చోట్ల సందడులు 
అందరికి ఆనందాలు !!

బోనం యెత్తుట ఓ కళరా 
అద్భుతమైన అలంకరణ
సాకలు పోసి స్వాగతము 
సద్దులు బోనం నైవేద్యము 

వేపమండల అలంకారం 
పోతురాజుల వీరంగం 
రంగం చెప్పే రమ్యముగా 
గుగ్గిలం ధూపం వేయంగా 

అమ్మోరి సిగంతో సంచలనం 
ఊరు వాడా గుడి పయనం 
ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ లూ 
రోగాలు తోలేటి మా తల్లులు !!

కామెంట్‌లు