సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 ఒప్పులు... తప్పులు..
     *****
కొందరికి తమ మీద తమకు అపరిమితమైన నమ్మకం ఉంటుంది. తాము చేసేవి అన్నీ ఒప్పులే అనీ,  ఎవరూ వంక పెట్టలేరనే ధీమా, దురభిప్రాయంతో  ఉంటారు.
తప్పులు, పొరపాట్లు సహజంగా  జరుగుతూనే ఉంటాయనేది గమనంలో పెట్టుకోవాలి. అలాంటి తప్పులను ఒప్పులుగా  కప్పి పుచ్చుకునేందుకు చేసే ప్రయత్నాలే పెద్ద తప్పు. అలా చేయడం వల్ల ఎదుటి వారి దృష్టిలో చులకనై పోతుంటారు.
తప్పులు, పొరపాట్లు జరిగినప్పుడు నిజాయితీగా ఒప్పుకోవడమనేది వ్యక్తి యొక్క సంస్కారాన్ని తెలియజేస్తుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు