అలనాటి గాయనీమణులు!;-సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

 దాదాపు మూడు తరాల క్రితందాకా కర్ణాటక సంగీతం అయ్యర్ అయ్యంగార్ కుటుంబాలలో వారికే పరిమితం! అప్పటి స్త్రీలు గొంతు ఎత్తి పాడేవారుకాదు.గృహిణిలు  పెళ్లి పేరంటాలలో కూడా నోరెత్తలేదు. తమపాండిత్యం విద్వత్తు తమలోనే దాచుకునేవారు. సెమ్మంగుడి శ్రీ నివాస అయ్యర్  డి.కె.పట్టమ్మాళ్ తల్లి అలా  ఆడవారి వేడుకలో తోటి మహిళలకు మాత్రం వినిపించేవారు. కొన్ని కులాల వారికి మాత్రం స్వేచ్ఛ ఉండేది. మధురై షణ్ముగవడివు దేవాలయాలకు అంకితంఐన దేవదాసీలు పాడేవారు.ఇతరులకి నేర్పేవారు.ఇక గాత్రసంగీతంలో కోయంబత్తూరు తాయి సేలం గోదావరి  మద్రాసు లలితాంగి బెంగుళూరు నాగరత్నమ్మ ప్రసిద్ధులు. వారికి  ఊర్లపేర్లు ఇళ్లపేర్లుగా మారాయి.వీణ ధనం ప్రతిశుక్రవారం తన ఇంట్లోనే కచేరీ ఇచ్చేది. బైట కచేరీలకు ససేమిరా అంది.ఎవరు ఏకాస్త శబ్దం చేసినా  వెంటనే వీణ ఆపి లోపలికి వెళ్ళి పోయేది. బైట వారిని ఆహ్వానించి తన వీణ కచేరీ మొదలు పెట్టేది. బెంగళూరు నాగరత్నమ్మ బాల్యం నించి ఎన్నో కష్టాలు ఎదుర్కొంది.తిరువయ్యూర్ త్యాగరాజు సమాధిని కట్టించి1941నించి త్యాగరాజు ఆరాధనోత్సవాలు ప్రారంభించిన  పుణ్యాత్మురాలు.అప్పుడే "నేను దేవదాసిని ఆదైవానికే దాసిని"అని ధైర్యం గా ఆమె అన్న మాటలకు  కరతాళ ధ్వనులతో ఆప్రాంతం దద్దరిల్లింది.వీణధనమ్మాళ్ అమ్మమ్మ కు అమ్మమ్మ  పాపమ్మాళ్ తంజావూరు ఆస్థాన సంగీత నృత్యకళాకారిణిగా వన్నెకెక్కింది.అమ్మమ్మ కామాక్షి శ్యామ శాస్త్రి శిష్యురాలు. ఆమె మనవరాళ్లు టి.బృంద  ముక్త   ప్రసిద్ధ రేడియో విద్వాంసులు. 🌹
కామెంట్‌లు