పగులుతున్న గుండెనలా పదేపదే పిండేయకు
నలుగుతున్న హృదిని చూసి చూడనట్లు వదిలేయకు
విరహం ఒక మధురమైన వేదన అని తెలుసుకదా!
కారుతున్న కన్నీటిని కర్కశముగ తుడిచేయకు
ఎందుకలా కళ్ళెపుడూ నీకోసం వెతుకుతాయి?
అమావాస్య చంద్రుడిలా మోమునలా చాటేయకు
పెదవులలా నీపేరును ప్రియమారా జపిస్తాయి
తాళికట్టి ఏమండీ అను పిలుపును అడిగేయకు
విడదీసిన ఆషాఢం వికటముగా నవ్వుతుంది
పావురానికిచ్చి లేఖ పంపడమే మరిచేయకు
తొడిమ వీడు పూవైనా తల్లడిల్లి శోకించదు
నెలతప్పిన నన్ను ఆపి నువ్వు ఎగిరి గంతేయకు
వసంతమే వీడిపోని వనమయ్యెను ప్రియ రాధిక
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి