సుప్రభాత కవిత ; -బృంద
చీకటి రాత్రికి
వెలుగుల ఉగాది

చీకటి వెలుగుల  
సంగమ సమయం

యుగాల నాటి ప్రేమకు
జగాన కనపడే గుర్తు

ఉదయరాగమాలపించి
పిలిచే  రాత్రి
పిలుపునందుకుని

వెలుగురేఖల చేయి చావి
రాత్రిని  దాచేసిన  ఉదయం

అతిశయమైన వెలుగులతో
రేయిని  ముంచెత్తిన  పగలు

రాలుపూలరాగాలన్నీ
విరిసే పువ్వుల యోగాలు

మేఘాల దుప్పటి తీసి
వెలుగును  చూసిన గగనం

ప్రకృతి తన మౌనమే
ఆలాపనగా
మధురగీతం పాడుతూ

జీవనపరిమళం పంచే
సొగసైన ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు