కారణకార్యములివి;- కోరాడ నరసింహా రావు... !

  శ్రీరాముడా ధర్మస్వరూపుడు, సాక్షాత్ నారాయణుడు !
సీతాదేవియా...భువనైక మాత 
. కైకయా...రామునిపై ప్రేమలో కన్నతల్లికన్న మిన్నయే.... !!
రాముడు వనములకేగిన, భర్త బ్రతుకడన్న సత్యము నెరుగని
మూర్ఖురాలు కాదు !
వనవాసమునసీతబంగారులేడి నిచూసి మోహపడుటేమి!
 సీతనుకోల్పోయి విలపించుటే మి.......!?
    విధర్మీయులు, నాస్తికులు... 
చేయవచ్చునెన్నైన,కువిమర్శలు... !
   ఈ కార్యములన్నియు,కారణ హేతువులే !
  ఇవన్నియు ఈ రీతిగనే జరుగ వలయు, రావణ సంహారమున కివన్నియునిమిత్త మాత్రములు
    ఒక కార్యమింకొకకార్యమున కు కారణమై యుండు !
  కార్య కారణ సంబంధములని వార్యములు !!
కార్య, కారణములు... చర్య, ప్రతిచర్యలే సృష్ఠి,స్థితిలయము లకు హేతువులు  !
ఇదియే వేదాంత తత్వము !
దీనినే ఆధునికులు" సైన్స్ "
పిలుచుచూ... ఆ సైన్స్ కు మూలమైన సిద్ధాంతమునే.... 
కించపరచుట హాస్యాస్పదము !
     ******
కామెంట్‌లు