తథాస్తు; - సుమ కైకాల
 సుందరి సుందరం  దంపతులు తమ అరవై యేండ్ల వైవాహిక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
దేవుడు వాళ్లను చూసి ముచ్చటపడి వరాలివ్వాలనుకున్నాడు. వెంటనే వాళ్లముందు ప్రత్యక్షమై "మీరు మనసులో మీకు ఏం కావాలో కోరుకోండి అవి నెరవేరుతాయి" అన్నాడు.
'నా భర్తతో కలిసి ప్రపంచమంతా చుట్టి
రావాలనుంది' అని కోరుకుంది సుందరి ప్రేమగా భర్తను చూస్తూ.
'అలాగే' అని రెండు విమానం టికెట్లు ఆమె చేతుల్లో పెట్టాడు దేవుడు.

'నాకంటే ముప్పై ఏళ్లు చిన్నమ్మాయితో
కలిసి ప్రపంచమంతా చుట్టి రావాలనుంది' అని కోరుకున్నాడు సుందరం.
'తథాస్తు' అని మాయమయ్యాడు దేవుడు.
వెంటనే సుందరం తొంభై ఏళ్ల వృద్ధుడిగా మారిపోయాడు!!
"ఇదేమిటి పాపం మీరు ముసలివాడు  అయిపోవాలి అని కోరుకున్నారా? " ...
పాపం! ఏమని చెప్పాలో తెలియని సుందరం తన అత్యాశకు తనే బలి అయిపోయాడు.

కామెంట్‌లు