సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 చెరగనీయకు... మలగనీయకు...
******
మనిషంటేనే ఆశలకు, ఆకాంక్షలకు నిలయం.
ఉన్నత వ్యక్తిత్వం అవుతుంది ఆశయాల సమాహారం.
ఆశల సాధనలో పోరాటం తప్పదు.
ఆశయాల  సాకారంలో అవరోధాలు తప్పవు.
పోరాటంలో ఓడుతామని  భయపడితే ,పాదం ముందుకు సాగదు.
అవరోధాలకు దడిస్తే ఆశయం వెలుగు చూడలేదు.
 పెదవులపై చిరునవ్వు చెరగనీయక సైనికుడిలా పోరాడు.ఫలితం నీకై ఎదురు చూస్తుంది.
ఆశయాలను  లోలోపల మలగనీయకు.  ఎదురయ్యే అవరోధాలను ఆత్మ విశ్వాస చమురు చేసి నింపుకో.
 అప్పుడే ఆశయం నిరంతరం వెలిగే అఖండ దీపం అవుతుంది.
ఆశలు సాధిస్తే ఆత్మ తృప్తి కలుగుతుంది.
ఆశయాలు వెలుగు చూస్తే,జీవితం చరితామృతమై, దివ్య జ్యోతి అవుతుంది.
 ఆ  జ్యోతి వెలుగులో  సమాజం మంచి బాట నడుస్తుంది...
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏కామెంట్‌లు