వ్యక్తిత్వం; : సి.హెచ్.ప్రతాప్
 కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఆమెను ఓదార్చడానికి కౌరవుల తల్లి  రాణి గాంధారిని సందర్శించాడు. గాంధారి శ్రీ కృష్ణుడికి వరుసకు అత్త అవుతుంది కదా.  అప్పుడు గాంధారి ఆయనను నిందిస్తూ, “ నువ్వు సాక్షాత్తు దేవుడివి. అయినా ఇంత పక్షపాతంగా ఎందుకు వ్యవహరించావు ?  బంధుత్వం పరంగా చూస్తే కౌరవులు, పాండవులు ఇద్దరూ నీకు సమానమే కదా ? అయినా పాండవులను ఆదరించి వారిని కంటికి రెప్పలా కాపాడావు. అదే కౌరవుల విషయంలో అయితే వారి పట్ల పక్షపాతంగా వ్యవహరించావు. నా నూరుగురు కొడుకులు ఒక్కొక్కరే నేలరాలుతున్నా పట్టించుకోలేదు.మేనల్లుడివై వుండి నాకు ఇంత గర్భ శోకం కలుగుతున్నా   నీకు చీమ కుట్టినట్లయినా లేదు. నా  వంద మందిలో ఒక్క కొడుకును కూడా రక్షించలేకపోయావు. " అని నిష్టూరమాడింది.
ఆ కఠినమైన మాటలకు నొచ్చుకోకుండా శాంతం వహిస్తూ కృష్ణుడు , “అత్తా   నీ పిల్లల మరణానికి నేను బాధ్యుడను కాను. అందుకు పూర్తిగా మీరే బాధ్యులు."
అందుకు గాంధారి నొచ్చుకుంటూ" అసలే కొడుకులందరినీ పోగొట్టుకొని పుట్టెడు దుఖం లో వున్నాను. అయినా నన్ను నిందించే కఠిన హృదయం నీకు ఎలా ఏర్పడింది ? అని అడిగింది. గాంధారి, “నన్ను ఇలా నిందించేంత కఠిన హృదయం ఎలా ఉంది?” అంది.
అప్పుడు కృష్ణుడు “అత్తా, నువ్వు వందమంది కొడుకులకు జన్మనిచ్చావు, అయినా వారిలో ఎవరినైనా ప్రేమపూర్వకంగా చూసావా? మీరు కళ్లకు గంతలు కట్టుకుని ఉండటాన్ని ఎంచుకున్నారు. నీ కొడుకులు ఎలా ఉన్నారో కూడా మీరు చూడలేకపోయారు. వారు తమ తల్లి యొక్క లేత సంరక్షణ మరియు ఆప్యాయతతో కూడిన చూపును ఆస్వాదించలేక పోయినందున వారు అందరికంటే చాలా దురదృష్టవంతులు. వారు క్రమశిక్షణ, కర్తవ్యం, నీతిమంతులుగా ఎలా ఎదగగలరు? తల్లి ఒక వ్యక్తికి మొదటి గురువు మరియు బోధకురాలు. మీ పరిస్థితి గురించి ఆలోచించండి మరియు పాండవుల తల్లి రాణి కుంతితో పోల్చండి. భర్త మరణానంతరం కుంతి తన కుమారులను ఎంతో శ్రద్ధగా, ఆప్యాయంగా పెంచింది. ఆమె వారితో పాటు రాజభవనంలో మరియు మైనపు ఇంట్లో కూడా ఉంది. పాండవులు తమ తల్లి అనుగ్రహం లేకుండా ఏ పని చేయరు. కేవలం, మంచితనం, మానవత్వం, క్రమశిక్షణ, ఉన్నత వ్యక్తిత్వపు విలువలు వంటి అంశాల కారణంగానే  వారు నా అనుగ్రహాన్ని పొందగలిగారు.  జన్మ నివ్వగానే తల్లి యొక్క బాధ్యత పూర్తయిపోదు. పిల్లలు ఉన్నత వ్యక్తివం సంతరించుకొని ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా వారిని తీర్చిదిద్దే బాధ్యత కూడా తల్లే తీసుకోవాలి. కౌరవుల విషయంలో వారి సంరక్షణ బాధ్యతలు తీసుకోకుండా నువ్వు చాలా పెద్ద పొరపాటు చేసావు. ఫలితంగా మంచికి దూరమై, దుర్మార్గపు వ్యక్తిత్వం సంతరించుకున్నారు. తమ చెడు కర్మల కారణంగానే  అకాల మరణం చెందారు. కేవలం బంధుత్వం కారణంగా నేను చెడును సమర్ధించలేను" అని మృదువుగా చెప్పాడు.
ఆ మాటలకు గాంధారికి జ్ఞానోదయ మయ్యింది. అనవసరంగా నిందించినందుకు శ్రీకృష్ణభగవానుడిని క్షమించమని ప్రార్ధించింది.
 
భగవంతుని కృప పొందడానికి మనమేం చెయ్యలో, ఎలాంటి వ్యక్తిత్వం సంతరించుకోవాలో, పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర ఎలాంటిదో శ్రీ కృష్ణుడు ఈ సంఘటన ద్వారా స్పష్టంగా మానవాళికి తెలియజేసాడు.

కామెంట్‌లు