జాషువా పురస్కారం అందుకున్న పాకల వ్యాయామ ఉపాధ్యాయులు, కవి శ్రీ పిల్లి హజరత్తయ్య

 మహాకవి జాషువా 51 వ వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో తే 24/07/22 న తెనాలి, కవిరాజు పార్కు, సీనియర్ సిటిజన్ హాల్ నందు జరిగిన * మహాకవి గుర్రం జాషువా పురస్కారంసభలో కవి,వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ పిల్లి హజరత్తయ్య గారు మాజీ మంత్రి, ప్రస్తుత యమ్.ఎల్.సి  శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్ చేతుల మీదుగా జాషువాపురస్కారాన్నిఅందుకున్నారు.సాహిత్య రంగంలో దాదాపుగా 500పైగా కవితలు,50 కథలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించారు.తాను రచించిన100 కవితలనువెలుగు దివ్వెలు*కవితా సంపుటిలో పొందుపరుస్తూ పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది.సాహితీరంగంలో చేస్తున్న సేవలకు గాను ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు జాషువా స్మారక కళాపరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు డా" పెద్దీటి యెహాను గారు తెలిపారు.ఈ సందర్భంగా హజరత్తయ్య గారు మాట్లాడుతూ తాను సేవలను గుర్తించి జాషువా పురస్కారం అందజేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తపరిచారు.
కామెంట్‌లు