* సంతృప్తి * కోరాడ నరసింహారావు !

 పొద్దు పొడవక ముందు లేచి 
   తుప్పనక, డొంకనక 
     పురుగనక, పుట్టనక 
       అడివంతా తిరిగి-తిరిగి 
తెంపిన అడ్డాకులను... 
  విస్తర్లుగా  కుట్టి... కట్టగ  కట్టి 
అలసటదీర్చుకొనగావిశ్రమించిన ఆదివాసీ అతివ మదిలో.... 
ఎన్నెన్నోఆలోచనలఅలజడులు
  కొండదిగి... గట్టులు, గుట్టలు 
  క్రోసులదూరంనడచి... అలసి-సొలసిఆకలితీరితుందన్నఆశతోషావుకారుకమ్ముకుంటే..శ్రమకు  తగ్గ డబ్బులుండవు కడుపు నిండా కూటికే చాలవు  !
కష్టం ఎరుగక కూచుని అమ్మి...
 కోట్లు గడించే కోమటి తెలివి...
తలపుకు వచ్చెనేమో.... !
 సులువుగబతికేతెలివైనోళ్ళను 
అనుక్షణంచూస్తున్నా... ,అన్యాయానికిమనసొప్పనిమనసులవి,అక్రమార్జనకుతలొగ్గనిబ్రతుకులివి !! కాయకష్టంతో కడుపు నిండక, అర్ధాకలితో అలమటిం చినా...ఆరోగ్యంతో ఆనందంగా బ్రతక గలిగే అదృష్టం..., అది కేవలం వారి @సంతృప్తే@... ! 
కామెంట్‌లు