చిత్రకవిత :- @ లోలోతుల సుడిగుండా లెన్నున్నా.... !@-- కోరాడ నరసింహా రావు.
మెదడు పుస్తకంలో భావనల పుటలు ... !
  అంతరంగ మధనంలో... 
   ఆలోచనా తరంగాలు !!

ఎన్నెన్ని తీపి - చేదుల.... 
  జ్ఞాపకాలో...ఆలోచనా లోచన
ల లో  గజిబిజి దృశ్యాలు !
ఏ నిర్ణయాలు చేయిస్తాయో... 
  యే తీరాలను చేరుస్తాయో!!

మహా సముద్రపు మనిషి మన సు 
లోలోతులసుడిగుండాలెన్ను న్నా...,
సమాజ తీరానికి ఆహ్లాద
తరంగాలే తాకాలి సోదరీ !

కామెంట్‌లు