సుప్రభాత కవిత ; -బృంద
తీరంతో కెరటాల సరసాలు
దోబూచుల సయ్యాటలు

తొలిసంధ్య  మెరుపులు
వెలుగు కప్పేసిన చీకట్లు

 గగనంలో గంధర్వ గానం
వెలుగురేఖల ఉదయరాగం

ఇహపరాల వారధిలా
దూరాన కలిసిన నింగీ నేలా

వెల్లువైన  వెలుగుల్లో
రంగుల సోయగాలు

నిశిలోని నిశ్శబ్దాల ప్రశ్నలకు
ఉష ఇస్తున్న  కమ్మని జవాబులు

కరగని  కలల  తీరున
తరగని అలల  జోరు

లోపలి కలవరం తెలియనివ్వని
మనసు సంద్రం తీరు.

రాబోవు క్షణాలన్నిటినీ
బంగారు క్షణాలుగా మార్చుకునే
ఉత్తేజానిచ్చే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు