గుహలు.;- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 గుహ, కొండలలో, భూమిలో సహజంగా ఏర్పడిన ఖాళీ. ఈ ఖాళీలు పెద్దవిగా, మనుషులు వెళ్ళగలిగేంత పరిమాణంలో ఉంటాయి. రాళ్ళు సహజమైన కోతకు గురైనపుడు గుహలు ఏర్పడతాయి. భూమి లోకి బాగా లోతుగా ఉండవచ్చు. సాధారణంగా గుహల ముఖద్వారాల వెడల్పు కంటే వాటి లోతు ఎక్కువగా ఉంటుంది. వాటిని ఎక్సోజీన్ అంటారు. ఐతే రాక్ షెల్టరు వంటి కొన్ని గుహలు లోతు తక్కువగాఅ ఉంటాయి. వీటిని ఎండోజీన్ అంటారు. గుహలను, గుహల్లోని పర్యావరణాన్నీ అధ్యయనం చేసే శాస్త్రాన్ని స్పీలియాలజీ అంటారు. వినోదం , విహారాల కోసం గుహల్లోకి వెళ్ళడాన్ని కేవింగ్ అంటారు.
గుహలలో రకాలు.
గుహలు కొన్ని కోట్ల సవత్సరాల కాలంలో ఏర్పడతాయి. అనేక భూగర్భ ప్రక్రియల ద్వారా ఇవి ఏర్పడవచ్చు. రసాయనిక చర్యలు, నీటి కోత, టెక్టోనిక్ బలాలు, సూక్ష్మజీవులు, వత్తిడి, వాతావరణ ప్రభావం మొదలైనవి వీటిలో కొన్ని.భూమి లోపలికి ఉన్న గుహ నిట్టనిలువు లోతు 3,000 మీటర్లకు మించి ఉండదని అంచనా వేసారు. పైనున్న రాళ్ళ వలన కలిగే పీడనం దీనికి కారణం. గుహల్లో కింది రకాలున్నాయి:
సొల్యూషనల్ గుహలు.
చాలా ఎక్కువగా కనిపించే గుహలివి. ఇవి రాతిలో, ఎక్కువగా సున్నపురాయిలో ఏర్పడతాయి. డొలమైట్, చలువరాయి వంటి వాటిలో కూడా ఏర్పడతాయి. వీటిలో ఉన్న పగుళ్ళ గుండా నీరు ప్రవహించి ఈ రాతిని కరిగించుకూంటు పోవడంతో ప్గుళ్ళు విస్త్రించి గుహలు ఏర్పడతాయి.
ప్రాథమిక గుహ.
ట్టూ ఉన్న శిలలు ఏర్పడినప్పుడే ఏర్పడిన గుహలను ప్రథమిక గుహలు అంటారు
సముద్రపు గుహలు.
ఇవి సముద్ర తీరాల వద్ద ఏర్పడే గుహలు.
కరోజనల్ గుహ లేద ఇరోజనల్ గుహ.
నీటి ప్రవాహాల కోత వలన ఏర్పడే గుహలు
గ్లేసియర్ గుహ.
ఐసు కరిగి ప్రవహించి పోవడంతో ఈ గుహలు ఏర్పడతాయి
పగుళ్ళ గుహలు.
నీటిలో కరగని రాళ్ళ మధ్య కరిగే జిప్సం వంటి పొరలు ఉన్నపుడు అవి కరిగిపోయి పగుళ్ళు ఏర్పడతాయి. దీంతో పైనున్న రాళ్ళు కూలబడి గుహలు ఏర్పడతాయి.
టాలస్ గుహకు.
రళ్ళ గుట్టల మధ్య ఏర్పడే గుహలు.
ఏంకియలైన్ గుహలు.
సముద్ర తీరానికి దగ్గర్లో ఏర్పడే గుహలు. వీటిలో ఉప్పునీటితో పాటు మంచినీరు కూడా ఉంటుంది.

కామెంట్‌లు