పం చాం గ ము"శంకర ప్రియ.," శీల.,సంచారవాణి: ౯౯౧౨౭ ౬౭౦౯౮
 🙏తిధి, వార, నక్షత్ర
 
    యోగ, కరణము లైదు
    "పంచాంగము" లనగా
            ఓ తెలుగు బాల!
           ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.,)
👌"పంచాంగము" అనగా.. అయిదు అంగములు గలది! తిథి.. వారము.. నక్షత్రము.. యోగము.. కరణము.. అనువాటి గురించి; సవివరంగా పేర్కొను చున్నదీ "పంచాంగము"!
👌 సంపద నొసంగు తుంది.. "తిధి"! (1)
    ఆయుర్దాయమును వృద్ధిచెందించు తుంది.. "వారము"! (2)
     పాపములను హరించుతుంది.. "నక్షత్రము"! (3)
     రోగములను నివారించుతుంది.. "యోగము"! (4)
     కార్యసాధనకు దోహద  పడుతుంది.. "కరణము"! (5)
👌పంచాంగము.. ఈ విధముగా ఆస్తిక మహాశయులకు.. బహుళ ప్రయోజనములను కలిగించు చున్నది! 
     "తిథేశ్చ శ్రియ మాప్నోతి
 వారా దాయుష్య వర్ధనం! 
      నక్షత్రాత్ హరతే పాపం 
యోగాత్ రోగ నివారణం! 
     కరణాత్ కార్య సిధ్ధించ
పంచాంగ ఫల ముత్తమం!"
.... అని, శాంతి కాముకు లైన మనమహర్షులు పేర్కొన్నారు!
 ⚜️చంపక మాల⚜️
    శుభములు గూర్చునట్టి "తిధి" శోభిత "వారము"లన్ పఠించుచున్
     విభవము లొల్కు "తారక"ల విచ్చెడి 'యోగము"కై నుతించుచున్ 
    ప్రభ "కరణమ్ము" గాగ భువి రాజిలు చుండును మానవాళి, స
     న్నిభమగు "జ్యోతిష" మ్మనగ నిత్యము పృథ్వికి మేలొసంగెడిన్ !
     ⚜️తేట గీతి ⚜️
     సకల వేదాంగమై వెల్గు శాస్త్రమనగ
     "జ్యోతిష"మ్మగు, దానిని స్ఫూర్తి గొనుచు
      సాగుచుండెడి మనుజులు శాశ్వతముగ
      భవ్య ఫలముల నందుచు బ్రతుక గలరు! 
( ..జ్యోతిష ప్రశంస: డా. అయాచితం నటేశ్వర శర్మ., )

కామెంట్‌లు