సునంద భాషితం;- వురిమళ్ల సునంద ఖమ్మం
 విలాసం... విలాపం... 
     ****  
 కొందరు తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడుతూ విలాసవంతమైన జీవితాన్ని  గడపడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.
అలాంటి  జీవితం కోసం ఎంతో అమూల్యమైన సమయాన్ని, సంపాదనను, రేపు అనే ఆలోచన లేకుండా  ఖర్చు పెడుతూ ఉంటారు.
 ఎంత ఉవ్వెత్తున ఉప్పొంగినా సముద్రం చెలియలి కట్ట దాటకుండా ఉంటేనే బాగుంటుంది కదా.
 పూర్వాపరాలు ఆలోచించకుండా, ఇతరుల ముందు డాబు, దర్పం ప్రదర్శిస్తూ ఉన్నదంతా విలాసాలు,కులాసాల కోసం  ఉపయోగిస్తే....
భవిష్యత్తు శూన్యమై  విలాపానికి దారి తీస్తుంది. 
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఎంత  విలపించినా గతించిన కాలమూ తిరిగిరాదు. నలుగురిలో నగుబాటు తనమూ పోదు.
 విలాసాన్ని చూసి వినయంగా చుట్టూ చేరి పొగడ్తలతో ముంచెత్తిన వారే , అన్నీ కోల్పోయి విలాపంతో కుమిలే వేళ విమర్శనాస్త్రాలు సంధిస్తారనే సత్యాన్ని గ్రహించి  మసలుకుంటే...
విలాసం విలాపం కాకుండా జీవితంలో ఆరోగ్యవంతమైన ఆనందం  దరి చేరుతుంది.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు