“నా ప్రతీక్షణం నీ కోసమే” కవిత మాలిక ధారావాహిక ---- రవి బాబు పిట్టల, ఎన్విరాన్మెంటలిస్ట్.
నీలి వెన్నెల జాబిలి...!
నిత్య సుందరం నీ లోగిలి...!

పౌర్ణమి రోజు నీ అందం...!
అద్భుతమైన అపురూప చందం...!

వెండివెన్నెల చూడగానే...! 
కలువ భామ మురిసిపోయే...!

నీ పూర్ణ బింబం చూడగానే...!
కడలి తల్లి పొంగిపోయే...!

అందమైన నీ వెండి వెన్నెల్లో...!
కొండకోనలు మెరిసిపోయే...!

నీ చిరునవ్వు నవ్వగానే...!
ఆ చీకటి సైతం పారిపోయే...!

సిగ్గు మోముతో మబ్బు చాటున...!
ముసిముసిగా మురిసిపోతవ్...!

కవులెందరో నీ అందం చూస్తే...!
వారి కలములు పొగడ రాసే...!

ఆడపిల్లలు నిన్ను చూస్తే...!
అలక మాని ఆదమరిచే...!

నెలవంకవై శివుని జడలో...!
వెలుగు వైతివి జగతికిలలో...!

లేడి పిల్లలు నిన్ను చూస్తే...!
సంతసంబున గంతులేసే...!

అమ్మ చూపిన మొదటిసారి...!
ఏడు పాపి నిన్ను చూశా...!

ఆనందంతో నోరు తెరిచా...!
గోరుముద్దలు ఆరగించా...!

అమ్మ పాడిన జోలపాటకు...!
లాలి వైతివి జాబిలమ్మ...!

అద్భుతమైన నీ అందం...!
జగతికైైనది వెలుగు చందం...!

ప్రతిరోజు నీ ఆగమనం...!
మానవాళికి మహానందం...!

వెండి వెన్నెలమ్మ...!
ఈజగతికి నువ్ వెలుగమ్మ...!

పంచ భూతాలే కవితాక్షరమాలతో మనిషిని అర్జించిన వేళ...ఈ “నా ప్రతీక్షణం నీ కోసమే” - 

(సశేషం...).

కామెంట్‌లు