సుప్రభాత కవిత ; -బృంద
రెప్పల చాటున 
ఊగిసలాడే స్వప్నాలు

గుండె గదిలో ఉంచి
గడియ వేసిన కోరికలూ

అవసరమైన గెలుపులు
అలసిపోయిన ఓటములూ

అడుగుపడనీయని ఆటంకాలు
బ్రతుకుదారిలో కంటకాలూ


దిక్కుతోచని దిగులూ
గుండెనిండిన గుబులూ

అన్నీ దైవానికి అవగతమే!
వదిలేయాలి అవన్నీ గతమే!

ఏది మనకు ఎపుడు
ప్రసాదించాలో కాలానికి
బాగాతెలుసు.

కోరినది కాదు అవసరమైనది
మనకు తప్పక ప్రాప్తిస్తుంది.

కసుగాయలాటి మొగ్గ
పువ్వులా విరబూయడానికీ
కూడా నిర్దిష్ట సమయం వుంది.

మనకూ మన సమయం 
తప్పక వస్తుంది.

ఈ ఉదయం
మనకు అవసరమైనవి 
తెచ్చి ఇచ్చి మనల్ని
పరిమళింపచేయాలని
శుభాకాంక్షలతో

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు