సుప్రభాత కవిత ; -బృంద
అలనీలి గగనాన మెరుస్తూ
విరిసే నీ అందమైన రూపు

అవనిని ఆక్రమించిన
అంధకారాన్ని రూపు మాపు

అలుపెరుగని నీ ఆగమనం
మా మార్గం చేయును సుగమం

అలసిపోయిన మౌనానికి
వెలుగిచ్చే  సాంత్వనం
ఆరంభించే మరో ఉదయానికి
మంచి ఆలోచనల ప్రచోదనం

అనుభూతులు ఎఱుగని
మనసుకు కూ

డా ఆనందకారణం
అరుణ వర్ణంతో ఆకసాన నీ ఆగమనం

కొత్త ఊపిరి పోస్తూ
కొత్త ఉత్సాహం  ఇస్తూ
కొత్త ఆనందం పంచే
కలగన్న ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు