కవికిరణాలు;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవుల
కలాలు
జనుల
గళాలు

కవుల
కవితలు
బాషకు
వెలుగులు

కవుల
కవనము
జాతికి
మేలుకొలుపు

కవుల
ప్రబోధము
జనులకు
చైతన్యము

కవుల
కనుమరుగు
జగతికి
అఙ్ఞానంధకారము

కవుల
మనసులు
జనుల
ప్రతిబింబాలు

కవుల
చేతులు
ప్రజల
పనిముట్లు

కవుల
అక్షరాలు
రవి
కిరణాలు

కవుల
పఠనాలు
కోకిలల
గానాలు

కవుల
పంట
దేశ
సంపద

కవులను
ప్రోత్సహించండి
జాతిని
జాగృతంచేయండి


కామెంట్‌లు