మామిడి హరికృష్ణ కు జానపద సినిమాలపై పరిశోధనకు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్

 “తెలుగు సినిమాలలో జానపద కథాంశాలు – అధ్యయనం” అనే అంశంపై డా. భట్టు రమేష్ పర్యవేక్షణలో విస్తృతమైన పరిశోధన చేసిన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు ఈ రోజు డాక్టరేట్ పట్టాను వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం నుండి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటించింది. 1896 లో ప్రపంచంలో తొలిసారిగా లూమియెర్ బ్రదర్స్ ద్వారా చలనచిత్రాలు ఆవిష్కరించబడిన తర్వాత, 1913 లో దాదా సాహెబ్ ఫాల్కే ద్వారా భారతదేశంలో సినీ నిర్మాణం ప్రారంభమైన తర్వాత 1931 లో భక్తప్రహ్లాద సినిమాతో తెలుగులో సినిమాలు ప్రారంభమయ్యాయని, అప్పటి నుంచీ ఇప్పటి వరకు 90 ఏళ్ళ తెలుగు సినీ ప్రస్థానంలో దాదాపు 8600 పైగా చలనచిత్రాలు తెలుగులో నిర్మాణమయ్యాయని ఈ పరిశోధనలో  సవివరంగా తెలిపారు. సమైక్య సాహితి అధ్యక్షుడు మాడిశెట్టి గోపాల్ ఆయనకు అభినందనలు తెలిపారు
కామెంట్‌లు