మినీ కవిత;-ఎం. వి. ఉమాదేవి

 బడి,రాబడి, సాగుబడి, దిగుబడి
--------------------------
పల్లె పల్లెనా వెలసిన కాన్వెంట్ బడి 
నాలుగు ఇంగ్లిష్ ముక్కలు వస్తాయని ఆశతో 
కూలీనాలీ జనం బుడ్డోళ్లని పంపితే రాబడి 
ఫీజూ పుస్తకాలు,దుస్తులు బూట్లు, టై.. 
కడుపునింపని సోకులు తప్ప ఏముంది? 
కొంపకొల్లేరు చేసినా యాబిచ్చిళ్ళు సరిగారావు 
అరెకరం సాగుబడితో కుటుంబం శ్రమలు 
వచ్చే దిగుబడి అంతoత మాత్రమే 
సంవత్సరం తిరిగేసరికి తెలిసొచ్చింది 
ప్రభుత్వబడిలో సౌకర్యాలు అందిపుచ్చుకున్నారు 
తెలుగుతల్లికి నీరాజనమిచ్చినారు !
*******

కామెంట్‌లు