పొద్దు కనబడుటలేదు; (గుర్తుకొస్తున్నాయి) - సత్యవాణి
 ముసురు,ఒకటేముసురు.ఇల్లు,వాకిళ్ళుా ఒకటే చీదర.ఆషాఢ అతిథులైన ఈగలు పిలవకుండానే వచ్చిచేరి, తినేవాటిపైనేకాదు ,ముక్కుమీదా మూతిమీదావాలి చిరాకుతెప్పిస్తున్నాయి. సూరయ్యకనబడి నాలుగైదు రోజులైయ్యింది.
     మాచిన్నప్పుడు ఇలా ముసురుపట్టి వానకురుస్తున్నప్పుడు,'ఏం వానలోనమ్మా,ఆఇంటిమీదకాకి ,ఈ ఇటిమీదవాలడంలేదు' అనేవారు.నిజానికి 'ఇలాంటి పొద్దుకనబడని ముసురు చాలా ఏళ్ళతరువాత చూస్తున్నాము.
      ఇలాంటి సమయంలో  మా పెద్దమామ్మయ్య మోగంటి సుబ్బమ్మగారు తప్పక గుర్తుకొస్తారు.(మేము మా బామ్మని మామ్మయ్య అంటాము)
     ఇలా విడవని ముసురు పట్టి సుర్యుడు కనపడకపోతే మూడురోజులైనా,నాలుగైదు రోజులైనాగానీ ,మంచినీళ్ళుతప్పమరేదీ నోటపెట్టేదికాదు. తిన్నా
తినకున్నా, అడ్డెడు గిన్నెలు వార్చక తప్పేదికాదు తనకి.
    ఒక్కరోజు నిరాహారదీక్షచేస్తున్నా,అరపూటనీరాహారచేస్తున్నా,ఏసీలు,కూలర్లూ పెట్టుకొని, పట్టుపరుపులమీదపడుకొని,బాలీసులపై ఆనుకొనికూర్చొని నిరాహారదీక్షలు చేస్తారు మననాయకులు.అరపుటకే మేకప్ చేయించుకొంటారోఏమోకానీ,కళ్ళుపీక్కుపోయి,మొహం దోక్కుపోయి ,స్వపక్షంవారికి జాలికలిగేలా ,గుండెలు తరుక్కుపోయేలా కనిపిస్తారు వారు.అలాంటి నాయకుల దీక్షలు చుస్తున్నప్పుడల్లా,మా మామ్మయ్య తప్పకుండా గుర్తుకొస్తుంది.ఎంతటిభక్తిఎంతటి అకుంటితదీక్షా,ఎంతటి పట్టుదలో కదా ఆనాటి స్త్రీలకు అనిపిస్తుంది.
    అయితే పనులు చేసుకొంటూనే ,పిల్లల్లారా పొద్దుకనిపిస్తోందేమో చూడండంటూ గంటగటకు  మాపిల్లలను అడుగుతుండేది.తన నిరాహారం బాధ మాకుతెలియక,మధ్యాహ్నం భోజనం పొట్టపగిలేలాతినికూడా,సాయంత్రం చిరుతిండికోసం 'మామ్మయ్యా! మాకదిచేసిపెట్టు,ఇదిచేసిపెట్టు అంటూ హింసించేవాళ్ళం.పాపం మా మామ్మయ్య ఒక్కమాటనడంగానీ,విసుక్కోడంగానీ,కసురుకోడంగానీ చేసేదికాదు.ఓపికలేకపోయినా, నాలుగైదు రోజులుగా నిరాహారంగావున్నా, ఏదోఒకటి చేసిపడేసేదిమాకోసం.
    అలాంటి పొద్దుచూడకుండా భోజనంచేయక ,కటిక ఉపవాసాలు చేసే బామ్మలు మా ఇట్లోనేకాదు,మారౌతులపూడిలో  ఇటింటికీ ఒకరో ,ఇద్దరో ,ముగ్గురో వుండేవారు. 
       ఐదారురోజులుగా మాకాకినాడలో పొద్దుమొఖం చూడకపోవడంతో, మాఊరి బామ్మల ,అమ్మమ్మలమొఖాలన్నీ,వారి ఆప్యాయతా అనురాగాలన్నీ కళ్ళకు కట్టినట్టు జ్ఞాపకాలుగా నన్ను చుట్టుముట్టి ప్రేమతో ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి.వారదరికీ నా ప్రేమాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
              

కామెంట్‌లు