సినారె కవితా స్రవంతి అజరామరం; -మణినాథ్ కోపల్లె
మాతృమూర్తి మీద అభిమానంతో ‘నవ్వని పువ్వు’ సృష్టి 
యవ్వనాన  ప్రణయ గీతాల కవితలు 
పరిణితి దశలో మానవీయ కవితలు 
గేయ ఛందస్సు కవితల గతులు, ద్విపదకావ్యాల కవితలు 
నిరంతర సాహితీ వ్యవసాయం చేసే రైతుబిడ్డ  మన సినారె !!

ఆది నుంచి ఆధునికత  దాకా మానవ దశ పరిణామమే విశ్వంభర 
పాత్రలు లేని కథలో మానవుడే నాయకుడైన ‘విశ్వంభర’ 
మట్టిలో పుట్టిన మనిషి  చైతన్య స్థాయి బంధమే ‘విశ్వంభర’ 
విశ్వమానవతా దృక్పధం తో సాగిన ‘విశ్వంభర’  
కథాత్మక  గేయ కావ్యమై   ‘జ్ఞానపీఠం’  అందుకున్న  ‘విశ్వంభర’ 

 చదివింది ఉర్దూ మీడియం ఆశువుగా పలికాయి తెలుగు బావ కవితలు
ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడయినా వైస్ ఛాన్సలర్ అయినా
రాజ్య సభ మెంబరుగా పరిపాలనా దక్షత కలిగిన  కవి అయినా 
తెలుగు పండితులుగానే ఆసక్తి! 
ఎందరో విద్యార్ధులు, రచయితలు, గీత రచయితలకు స్ఫూర్తి !

అంతరాలను దర్శించే  గుణం వున్న స్రష్ట కవి సినారె 
జానపదుల సంస్కృతి ప్రభావంతో   సహజ కవి అయిన  సినారె
తెలుగు భాష సంచాలకులు గా  ఉన్న వైస్ ఛాన్సలర్ సినారె!
వేలాది సినీ గేయాలతో అందరి నోట చిరంజీవియైన  సినారె !
వేలాదిగాపుస్తకాలకు  పీఠికలు రాసిన సినారె!
సాహితీ సభలలో వారి ఉపన్యాసం ఎందరికో స్ఫూర్తి !

పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ఎన్నో బిరుదులు అందుకున్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి. నారాయణ రెడ్డికి ఈ చిరు అక్షర నీరాజనం!

కామెంట్‌లు