నీవే మార్గ నిర్దేశకుడవు కావాలి ;- కోరాడ నరసింహా రావు !
కొత్తజంటలను విడదీసి... 
  మోజును మరింత పెంచింది ఆషాడం !
.  తీపి ఊహల ఉత్సాహపు ఉరకలతో మరలా కలుపు తోంది... శ్రావణం !!
ఒక దుఃఖం... మరో సుఖానికి కారణమైతే, 
 ఓ సుఖం,మరోదుఃఖానికిహేతు వౌతుంది !     సుఖదుఃఖానుభవములే...జీవితం !!
  దుఃఖానుభవమేసుఖములోని
ఆనందాన్ని ఎరుకపరచగల గొ ప్ప బోధన !
  సుఖ - దుఃఖములు లేని జీవి తము ఉప్పులేని పప్పులా.... రుచిని  ఇవ్వలేదుగా... !!
  బాధ లను తలచి కృంగిపోవ టం అవివేకపుఅజ్ఞానమేనోయ్
బాధలనుభవిస్తున్నావంటే..... పాప ప్రక్షాళన జరిగిపోతోందని 
సుఖాలుసుగమమౌతున్నాయని తెలుసుకో... !
మంచిలోనూ చెడును వెదికే 
మూర్ఖుడుకాకూడదోయ్మనిషి
చెడులోనూ మంచిని దర్శించ గల జ్ఞాని !
  నీవు అజ్ఞానం నుండి జ్ఞానం వైపు పయనించాలి !
  విజ్ఞానివి కావాలి ! సుజ్ఞానిగా మారాలి !
  పూర్ణానంద మానవునిగా ప్ర కాశిస్తూ...ఈ ప్రపంచానికి మార్గనిర్దేశనం చేయాలి !! 
     *******

కామెంట్‌లు