సమస్యాపూరణం;-మచ్చ అనురాధ

 పద్యము పాడుగాదెపుడు పద్యము నెప్పుడు పాడగాదగన్! .
===================================
 ఉత్పలమాల
పద్యము పాడుచుండగను పావనమౌ మది  పారవశ్యమున్
పద్యము ప్రాణముల్ నిలుపు పద్యము హృద్యముగా తలంచినన్
పద్యము నుద్యమంబుగను భావితరాలకు నందజేయుమో
పద్యము పాడుగాదెపుడు పద్యమునెప్పుడు పాడగాదగన్.
కామెంట్‌లు
Venkat konadapalli చెప్పారు…
చాలా బావుంది