బోనం;-సుమ కైకాల

 బోనపు కుండ
మన శరీరానికి సంకేతం
అందులో ఉన్న అన్న పదార్థం
వ్యక్తుల జీవశక్తిని సంకేతిస్తే
ఆ ఘటంపై వెలిగే జ్యోతి
ఆత్మ దీపమై ప్రకాశిస్తుంది
మట్టి కుండలాంటి ఈ శరీరాన్ని
త్రికరణ శుద్ధిగా దైవశక్తితో
అనుసంధానం చేసుకోవడం ద్వారా
జీవన అభ్యున్నతిని సాధించవచ్చని
బోనాల వేడుక
పారమార్థిక సందేశాన్ని అందిస్తోంది!!
కామెంట్‌లు