విదురుడు - మహా జ్ఞానదీపం --ఎం. వి. ఉమాదేవి
హే కృష్ణా.. !
నీవెవరో తెలుసుకున్నాను  
నన్ను నేను తెలుసుకునే శక్తినివ్వు తండ్రీ... !నా లో జ్ఞానజ్యోతి వెలిగించు !!

రాజరిక వ్యవస్థలోని లోటుపాట్లను.. 
పుట్టుకతోనే ఎరిగిన దివ్య జ్ఞాని 
విధులకు మాత్రమే పట్టంకట్టబడిన విదురుడు... !
పాండునందనుల పరిరక్షణలో 
లక్క యింటి రహస్యం చెప్పి 
తక్షణమే వెడలిపొమ్మనే !

రాజ్యాధికారంపైన విముఖత 
రాజసలహాదారుడై విజ్ఞత 
సముచిత నిర్ణయాల సౌమ్యత 
కృష్ణ మాయ గురించి ఎరుకగల 
ధర్మపరుడు విదుర మహాత్ముడు!

రాజ్యరక్షణ ధ్యేయంతో హితోక్తి 
పలుకులు త

న కర్తవ్యంగా..., 
ధృతరాష్ట్రుని అతిపుత్ర ప్రేమకి 
చింతలో కుంతీపుత్రుల జయంకోరి 
ధర్మం విడువకసాగుమన్న జ్ఞాని! 

కృష్ణ రాయబారసమయం దివ్యం 
ఆ పరమాత్మకు ఆతిథ్యమిచ్చిన అదృష్టం 
రారాజు విందుకు తిరస్కరణతో
సాధారణ ఆతిథ్యమే కోరిన స్వామి 
విదురనీతికి యుగాలుగా జయం!!
కామెంట్‌లు