పుట్టింటి గొప్పలు;-Dr. కందేపి రాణీ ప్రసాద్
కొత్త కోడలు తన పుట్టిల్లు
గొప్పదనం వర్ణించు చున్నది
అమ్మలక్కలo తా ఆశ్చర్యంగా

మా వూరి బావుల్లో నీళ్ళు
తోడాల్సిన పనిలేదు
చేత్తో ముంచుకోవచ్చు

మా చేలో మిరపకాయలు
మునక్కాయ లంత
బారుగా కాస్తాయి

మా ఇంటి గో మా లక్ష్ములు
పాలు ఎన్నిస్తాయనుకున్నరు
తొట్టెలు నిండిపోవల్సిందే.

ఆ పాలను తోడు పెడితే
పెరుగు ఎంత గట్టిగా ఉంటుందో
చాకుతో కోసినా తెగదు తెలుసా

మా పెరట్లో నీ మల్లె మొగ్గలు
ఎంత పెద్దగా పుస్తాయో
తామరలు కూడా సరితుగవు.

మా అమ్మ నెయ్యి పోసే 
వందుతుంది యే వంటైనా
ఆఖరుకు అవకాయ లో కూడా

మా ఇంట్లో అరిసెలు 
ఎంత పెద్దగా ఉంటాయో తెలుసా
గంగాలం లో పట్టవు.

కామెంట్‌లు