సృజనకు అంబారీ-- Dr. కందేపి రాణిప్రసాద్
చేతుల్లో చిత్రలేఖనం
చూపుల్లో కళా దర్శనం
చేతల్లో సాహితీ పోషణ
కళ్ళల్లో దేశం పై ప్రేమ

స్త్రీ విద్య కుమంచి ప్రోత్సాహం
మహిళలు ఎదుగుదల ఆదర్శం
ఆదర్శ భావాల మూర్తి మత్వం
విజ్ఞాన శాస్త్రం పట్ల నమ్మకం

కరగని పాషాణ లోహాన్నైనా
ముల్లున్న తుమ్మ మొద్దైనా
మనసు లేని ఇనప యంత్రాలైనా
అందాల చిత్రాలే గోచరిస్తాయి.

అక్షరాలకు మంచి బట్టలు తొడిగి
కవుల కళ్ళ నీళ్ళు తుడిచి
కావ్యాలకు రాజ మార్గం ఏర్పరిచి
అభినవ సాహితీ భోజుడు.

ఫ్యామిలీ సంతోషాన్ని
కవిత్వం తో కలిపి 
ఇల్లు,మిల్లు ఏదైనా
కళను అద్దిన కళాకారుడు.

దేశభక్తి నీ నర నరానా
నింపుకుని దేశభక్తుడు
సమ సమాజం ను 
కా0క్షించిన కమ్యూనిస్ట్

సహనం త్యాగం 
కలగలసిన ప్రేమ నాన్న
స్నేహం, సౌహర్ధ్రం
మించిన ఇష్టం నాన్న.

దేశమంటే ప్రాణం
సాహిత్యం కు పెద్ద పీట
సృజన కు పట్టం
కళ కు అంబారీ కట్టిన నాన్న.

కామెంట్‌లు