ఇద్దరు కోట్ పల్లి KGBV విద్యార్థులకు హర్యానా పర్యటనకు అవకాశం ;-వెంకట్ మొలక ప్రతినిధి: వికారాబాద్ జిల్లా


  కోట్ పల్లి KGBV హర్యానా పర్యటనకు అవకాశం .ఏక్ బారత్ ..శ్రేష్టు భారత్ లో భాగంగా తెలంగాణ నుంచి 25 మంది విద్యార్థులు హర్యానా పర్యటనకు బయలుదేరిన విద్యార్థులు ఆజాద్ కి అమృత్ ఉత్సవాల్లో భాగంగా ఐదు రోజులపాటు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు అక్కడి నాగరికత. సంస్కృతి .ఆచార వ్యవహారాలు విద్యా విధానం .పాఠశాలల నిర్వహణ. తదితర అంశాలను పరిశీలిస్తారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై అక్కడివారికి అవగాహన కల్పిస్తారు .పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు జిల్లా స్థాయిలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల పోటీల్లో ఎంపిక చేసినారు విద్యార్థులను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ సంచాలకురాలు దేవసేన అభినందిస్తూ హర్యాన రాష్ట్రానికి పంపించారు. ఈ టూర్లో వికారాబాద్ జిల్లా కోటపల్లి కేజీబీవీ పాఠశాల విద్యార్థినిలు పదవ తరగతి చదువుతున్న మౌఖిక. 9వ తరగతి చదువుతున్న మల్లిక ఎంపిక కావడం S.O పల్లవి హర్షం వ్యక్తం చేస్తూ.DEO రేణుకా దేవికి ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులు అభినందించారు.
కామెంట్‌లు