-"జనని జయకేతనం";-:-చైతన్య భారతి పోతుల--హైదరాబాద్--ఫో.నo.7013264464
అవనిపై అవతరించే అపురూప అతివ,
జగమంత వెలుగు పంచే జగన్మాత.

అడుగుపెట్టని రంగమేది అవనిలో? 
బిడ్డగా తోబుట్టువుగా ఆలిగా అమ్మగా,
ఆ పుణ్యమూర్తిసేవలు అమోఘం.

సహనంతో సంసారమీదుతూ
ప్రేమలాలనతో..
బిడ్డల భవిత తీర్చిదిద్దుతూ..
రేబవలు..
తన ఉద్యోగ ధర్మాలను నెరవేరుస్తూ..
తానడుగిడిన రంగాలలో..
సాటిలేని మేటి సబలగా..
అత్యున్నత..
శిఖరాలనధిరోహిస్తున్న నారీశిరోమణి.

ఆయానుండి అంతరిక్షం దాకా,
కండక్టర్ నుండి కలెక్టర్ దాకా,
ప్రగతిని ప్రపంచానికి చూపిస్తూ..
అత్యాచార ఆరాచకవమానాగాథాలను,
గుండెల్లో దాచుకొని, గుంభనంగా సాగిపోతున్న ధీరోదాత్తత..

పురుషాధిక్యతను..
సాంఘికావమానాలను,
పంటిబిగువన దాచి,
బూజుపట్టిన భావజాలాన్ని,
తన చైతన్యంతో కాలరాస్తూ..
జీవితపోరాటాన్ని..
సాగిస్తున్న వీరనారీమణి.

అర్దనారీశ్వరం అవనిలో సగం,
లాంటి ఊకదంపుడు ఉపన్యాసాల
వదరుబోతులకు..
క్రమశిక్షణ సంఘకట్టుబాట్ల పేరుతో..
స్త్రీ స్వేచ్ఛను హరిస్తున్న
అహంకార విషపురుగులకు,
నీవిజయమో చెంపపెట్టని మరువకు.. 


కామెంట్‌లు