*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0122)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సంధ్య ఆత్మాహుతి - అరుంధతి గా వశిష్ఠునితో వివాహం - బ్రహ్మ శివ కళ్యాణం కొరకు శివదేవిని ఆశ్రయించుట*
*బ్రహ్మ, నారదుని ఇలా చెప్పాడు -* 
*పరమశివుని మాయలో వున్న నాకు, విష్ణుమూర్తి, ఈ విధంగా శివుని ఆజ్ఞతో, నన్ను కప్పి వున్న మాయ పొరలను తొలగించి నాకు కర్తవ్యం బోధించారు.*
• బ్రహ్మ దేవా! నేను చెప్పేది శ్రద్ధగా విను. నా మాట వేద శాస్త్రములకు అనుగుణంగా నే వుంటుంది. ఈ సమస్తమునకు శివుడే సృష్టి కర్త. రుద్రుడు, నీవు, నేను కూడా పరమశివుని దివ్య అంగముల నుండే ఉద్భవించాము. నీవు సృష్టి, నేను పాలన, రుద్రుడు లయము చేయాలని ఆ పరమశువుడే నిర్ణయించారు. మనము ముగ్గురమూ పరమశివుని రూపాలమే అయినా, రుద్రుడు పరమశివుని పూర్ణ రూపం. మహాదేవుని వామ భాగము నుండి ప్రత్యక్షమైన ఉమా దేవి కూడా, లక్ష్మి, సరస్వతి, సతి అని మూడు రూపాలలో తనను తాను వ్యక్త పరచు కుంది. అయినా సతి, ఉమా దేవి యొక్క పూర్ణ రూపము. నేను లక్ష్మీ దేవిని, నీవు సరస్వతీ దేవిని పత్నులుగా పొందాము, శివుని ఆజ్ఞతో. రుద్రుడు, సతీదేవి ని కాలాంతరంలో వివాహమాడుతాడు అని కూడా చెప్పారు, శివుడు. అలా ప్రకటితమైన రుద్రుడు, కైలాసములో నివాసము వుంటున్నారు.*
*బ్రహ్మదేవా! శివమహాదేవుని కళ్యాణం జరగాలి అనే నీకోరిక తీరాలంటే తదేకదీక్షతో పరమశివుని కరుణ కోరుకుంటూ తపస్సు చేయి. శివదేవి అనబడే ఉమ, సతీదేవి గా మానవరూపము ధరిస్తేనే శివ మహాదేవుని కళ్యాణం జరుగుతుంది. అందువలన, శివదేవిని కూడా ప్రసన్నం చేసుకోవడానికి ఆ తల్లిని మనసు నిండా నింపుకుని శివాశివుల వివాహం జరగాలి అనేకోరికతో తపస్సు చేయి. అప్పుడు ఆ తల్లి సతీదేవి గా దక్ష ప్రజాపతి ఇంట పుట్టి, రుద్రుడు గా వున్న శివదేవుని వివాహం ఆడుతుంది.*
*శివాశివులు ఇద్దరూ భక్త పరాధీనులు. వారు ఇద్దరూ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపలయి కూడా సగుణ స్వరూపులు అవగలరు. నీ తపస్సు కు మెచ్చి ఉమాదేవి సతీదేవి గా దక్షుని కుమార్తె గా అవతరించి రుద్రుని వివాహం చేసుకుంటుంది.  కనుక, సతీదేవి పుట్టుక కొరకు నీవు తపస్సు చేయి అని పలికి అంతర్ధానం అయ్యాడు, విష్ణువు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం