*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0124)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దక్షుని తపస్సు -  శివదేవి వరము ఇవ్వడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*శ్లో: ప్రసీద భగవత్ యాద్యే ప్రసీద శివరూపిణి! ప్రసీద భక్తవరదే జగన్మాయే నమోస్తుతే!!*
                          (శి.పు.రు.సం.స.ఖం. 12 / 14)
*అని కీర్తంచి అంబ దర్శనం పొందిన దక్షుడు, జగదం‌బా, మహామాయా నీవు నిత్యవు. నీవే సత్యానివి. భగవంతుడగు శివుడు, రుద్రుడుగా కైలాసంలో ఒంటరిగా తిరుగుతున్నాడు. రుద్రుడు పరమాత్మ అగు శివుని పూర్ణావతారము. నీవు ఉమవు. కానుక, నీవుతప్ప రుద్రుని భార్య గా వేరొకరు వుండలేరు. అందువలన, నీవు మానవ రూపములో నా ఇంట కూతురుగా పుట్టి, రుద్రుడుగా వున్న శివమహాదేవుని కళ్యాణం చేసుకోవలసింది. ఈ మీ ఇరువురి కళ్యాణం వలన లోకాలకు శుభం కలుగుతుంది. నీవు సౌందర్యలీలతో వారమోహినివి అయి సదాశివుని మోహింప చేయి తల్లీ.*
*ఇంతగా తనను ప్రార్ధించిన దక్షుని చూచి, శివదేవి అయిన ఉమ "దక్షా! నీ భక్తి నన్ను ఆకట్టుకుంది. నీ కోరిక దివ్యమైనదీ, సమస్త లోకాలకు ఆనందాన్ని కలిగించేది. నేను నీ కోరికను తప్పక తీరుస్తాను. మాహేశ్వరిని అయిన నేను, నీ ఇంటిలో నీ భార్య గర్భమున నీకు కూతురుగా జన్మిస్తాను. పరమశివుడు నిరాకారుడు. నిర్గుణుడు. నిర్వికారి. అందువలన ఆ స్వామికి పత్ని అవడానికి నేను సుదీర్ఘమైన తపస్సు ఆచరిస్తాను. అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహించి నన్ను తన పత్నిగా స్వీకరిస్తాడు. బ్రహ్మ, విష్ణువులు పరిపూర్ణులు అయినా, పరమశివుని నిత్యమూ కొలుస్తూ వుంటారు. ప్రతీ జన్మలోనూ, ఆదిశివుడు అనేక రూపములలో అవతరిస్తాడు. ఆ పరాత్పరుని ప్రతీ రూపంలో కూడా నేనే ఆయన దాసిని, ప్రియురాలను, పత్నిని. ఆ స్వామి వరముతో నేను ఆయన పత్నిని అవుతాను. కానీ, దక్ష ప్రజాపతి, ఒక విషయం నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు అయితే నీకు నా మీద ఆదరము, ప్రేమ, పోయి కటువుగా వ్యవహరిస్తావో అప్పుడు నేను నా శరీరాన్ని అగ్ని లో వదలి వేస్తాను. దీనికి తిరుగు లేదు. అని దక్షునికి వరము ఇచ్చి శివదేవి అయిన ఉమాదేవి అంతర్ధానం అవుతుంది.*
*ఉమయే తన ఇంట కూతురుగా జన్మిస్తుంది అనే సంతోషంలో ఇంటికి చేరుకుంటాడు, దక్ష ప్రజాపతి.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం