*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0126)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దక్షుడు హర్యశ్వులకు, శబలాశ్వులకు జన్మనిచ్చుట -  నారదునకు శాపం ఇవ్వడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
 *తన పదివేల మంది సంతానమైన హర్యశ్వులు తిరిగిరాని లోకాలకు వెళ్ళడానికి కారకుడు నారదుడు అని తెలుసుకుని, శివుని మాయలో వున్న దక్షుడు చాలా దుఃఖములో మునిగి పోయాడు. ఉత్తమమైన సంతానాన్ని కనడం ఎందుకు. వారు దూరమయ్యారని బాధపడటం ఎందుకు అని ఎంతగానో విచారుస్తూ వున్నాడు. అప్పుడు నేను (బ్రహ్మ) వెళ్ళి ఇది విధి లిఖితము. దీనికి ఎవ్వరూ కారణము గాదు. దైవ నిర్ణయమును తప్పించుకోలేము కదా అని నచ్చచెప్పి దక్షుని శాంత పరచాను. కొంతకాలము తరువాత అస్నికి గర్భము నుండి శబలాశ్వులనే వేయిమంది కుమారలకు జన్మ నిస్తాడు దక్షుడు. యుక్త వయసు వచ్చిన తరువాత శబలాశ్వులకు కూడా నారదుడు ఉపదేశించిన మీదట నారాయణ సరోవరమునకు వెళ్ళి నీరు తాకగానే జ్ఞానోదయం అయ్యి, పృధివి యొక్క అంతమును చూడటానికి వెళ్ళి ఇక తిరిగి రారు.*
*నారదా! నీ మనసులో ఎటువంటి వికారము వుండదు. నీవు ఎప్పుడూ శివ మహాదేవుని ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటూ పనులు చేస్తూ వుంటావు. శబలాశ్వులకు ఊర్ధ్వగతి కలుగ గానే, తపస్సు లో వున్న దక్షుని కి చెడు శకునాలు వినిపించాయి. అప్పుడు దక్షునికి శబలాశ్వులు కూడా హర్యశ్వులను అనుసరించి వెళ్ళారు అని తెలుస్తుంది.  ఎంతో దుఃఖము కలుగుతుంది. శివ మాయలో వున్న దక్షుడు తనను తాను తెలుసుకో లేక పోతాడు. నారదుడు ఇంత పని చేసాడే అని బాధ పడుతూ ఉంటాడు.*
*అప్పుడు, దక్షునికి ఉపశమనం కలిగించడానికి నారదుడు అక్కడికి వస్తాడు. నారదుని చూచిన దక్షుడు, దుఃఖాన్ని ఆపుకోలేక, నారదా నీవు కపట సన్యాసి వేషంలో అందరినీ మోసం చేస్తున్నావు. నా పిల్లలు రుషి, పితృ, దేవ రుణం తీర్చుకోకుండా, సన్యసించారు. ఈ మూడు రుణములు తీరకుండా మోక్షము రాదు. వారిని తప్పు దారిలో నడిపించావు కదా! నారదా! ఇప్పటి నుండి నీవు మూడు లోకాలలో తిరుగుతూనే వుంటావు. నీకు వుండేందుకు ఎక్కడా చోటు దొరకదు. త్రిలోక సంచారి అవుతావు. అని శపిస్తాడు.*
*దేవ పార్షదులలో ఉత్తముడైన నారదుడు స్వయముగా శాపమును తొలగించుకునే సమర్ధత వున్నా, శివమహాదేవుని ఆజ్ఞగా దక్షుని శాపాన్ని స్వీకరిస్తాడు. ఇదే బ్రహ్మ భావము. స్థిత ప్రజ్ఞత.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం