*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0127)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దక్షుడు 60 మంది కన్యలను వివాహమాడటం - వీరణిలో సంస్థ శివదేవి పుట్టడం - ఆమె చేష్టలతో తల్లిదండ్రులు ఆనందించడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
 *నారదా! నీవు నా కుమారుడవు. ముని శ్రేష్ఠుడవు. దేవతలకు ప్రియమైన వాడవు. అన్ని లోకాల మేలు కోరుకునే వాడివి. దక్షుడు నీకు త్రిలోక సంచారి అని శాపము ఇవ్వడం తెలుసుకుని దక్షుని వద్దకు వచ్చి శివమాయను విడమరచి చెప్పి మీ ఇద్దరికీ మరల స్నేహబంధం ఏర్పాటు చేసాను. తరువాత దక్షుడు తన భార్య వీరిణితో 60 మంది పుత్రికలను కని, వారిలో 10మందిని ధర్మునకు, 13మందిని కశ్యప మునికి, 27మందిని చంద్రునకు, భూత, అంగిరా, క్రుశ, అశ్వులకు ఇద్దరు చొప్పున, మిగిలి నలుగురి కన్యలను తార్క్ష్యుడు (అరిష్టనేమి)కి ఇచ్చి వివాహము శాస్త్ర బద్ధంగా చేసాడు. వీరి సంతానముతో భూమండలము సుసంపన్నం అయ్యింది.*
*పుత్ర పుత్రికల వివాహం అయిన తరువాత దక్షుడు తిరిగి జగదంబ తన కూతురిగా పుట్టాలి అని మనసులో స్థిర పరచుకుని భార్య వీరిణితో కలసి జగదంబ ను ధ్యాన్నించాడు. జగదంబ ప్రసన్నమై నేను వీరిణి గర్భము నందు జన్మిస్తాను అని వరము ఇస్తుంది. ఉమ, వీరిణి గర్భం లో నిలువగానే, అన్ని శుభసూచనలు కనిపిస్తాయి, దక్షునికి. వీరిణి కూడా శివదేవి మహిమతో బంగారు కాంతులతో ఆరోగ్యంగా నడయాడుతోంది. దక్షుని భార్య వీరిణి గర్భంలో భగవతి ఉమ వున్నది అని తెలుసుకుని బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు మిగిలిన దేవతలు చాలా సంతోషించారు. అన్ని లోకాలకు ఆద్య అయిన ఉమ, సతీదేవి గా జన్మిస్తోంది అని శివదేవికి పదే పదే నమస్కారాలు చేసారు. దక్ష ప్రజాపతిని, వీరిణిని ఆశీర్వదించి తమ తమ నెలవులకు వెళ్ళారు.*
*ఆకాశం నుండి మంగళ వాద్య ఘోష వినిపిస్తూ, పూల వర్షం కురిపిస్తూ, మేఘడు సన్నని చినుకుల అక్షతలు జల్లుతూ వున్న శుభ సమయంలో  వీరిణి గర్భంలో నవమాసాలు వున్న శివదేవి వీరిణి గర్భం నుండి సతీదేవి గా భూమి మీద అవతరించింది. తన ఇంట పుట్టిన శివదేవి అయిన సతిని చూచి, దక్షుడు ఆర్తితో కీర్తిస్తాడు. భగవతి జగన్మాతకు రెండు చేతులూ జోడించి నమస్కరించాడు. దక్షుని ప్రార్ధనలు విన్న శివదేవి అయిన సతి ప్రసన్నురాలు అయ్యింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు