*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 022*
 *చంపకమాల:*
*హలికునకున్ హలాగ్రమున | నర్ధము సేకురు భంగి దప్పిచే*
*నలమటఁ జెందువానికి సు | రాపగలో జల మబ్బినట్లు దు*
*ర్మలిన మనోవికారియగు | మర్త్యుని నన్నొఁడగూర్చి నీపయిన్*
*దలఁపు ఘటింపజేసితివి | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
ఎంతో కరుణా సముద్రుడవైన రామచంద్రా! 
దుక్కి దున్నే రైతుకు నాగలి కొన చివర డబ్బు వచ్చే మార్గము చూపుంచినట్టు, ఎంతో దాహం తో వున్న వానికి దేవనది అయిన గంగా నదిలో నీరు దొరికి నట్లు, ఎన్నో చెడు అలోచనలు కలిగిన నా మనసులో నీ వైపు ఆలోచనలు వచ్చేటట్టు చేసి నన్ను కాపాడావు కదా రామభద్రా!...... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*రాముడు కరుణాంతరంగుడు. దయా సముద్రుడు. తనను నమ్మి కొలచిన భరతుడు, పాదుకలు ఇవ్వమంటే, తనకు నడక దారిలో ఎమైన ఇబ్బంది కలుగుతుందేమో అని క్షణమాత్రము ఆలోచన చేయకుండా పాదుకలు ఇస్తాడు. నీ తల్లి కైకేయి రాజ్యం తీసుకుంది. నీవు పాదరక్షలు కూడా లేకుండా చేస్తున్నావు రామునికి అని లక్ష్మణుడు అంటే, తమ్ముడు భరతుని తప్పు ఏమీలేదు అతనిని ఏమీ అనవద్దు అని వారిస్తాడు, రామభద్రడు. ఇంత దయాళువైన రాముని కరుణ మనకందరకు ఎల్లప్పుడూ వుండేలా అనుగ్రహించమని పరమేశ్వరుని కోరుకుంటూ.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు