*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 023*
 *ఉత్పలమాల:*
*కొంజకతర్క వాదమును | గుద్దలిచేఁ బరతత్వభూస్థలిన్*
*రంజిలఁద్రవ్వి కన్గొనని | రామనిధానము నేఁడు భక్తి సి*
*ద్ధాంజన మందు హస్తగత | మయ్యె భళీ యనంగ మదీయ హృ*
*త్కంజమునన్ వసింపు మిక| దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
ఎంతో కరుణా సముద్రుడవైన రామచంద్రా! 
కొంచెము కూడా ఆలోచించ కుండా, వాదన అనే గునపము సహాయంతో పరతత్వము అనే భూముని తవ్వినా కూడా అవ్వని రాముని దర్శనము, భక్తి అనే కాటుకను పెట్టకున్నందువల్ల నాకు దొరికింది. ఆహా! ఏమి నా భాగ్యము.  ఇక నా హృదయము అనే కమల పుష్పములో నివసించి యుండు స్వామీ...... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*ఈ చరాచర ప్రపంచంలో భక్తి మార్గం ద్వారా భగవంతుని మనకు పరిచయం చేయగలిగిన వారు సద్గురువు ఒక్కరే. కలియుగంలో, మనసు నిండా భక్తిని నింపుకుని నామ స్మరణ చేయడంతోనే మోక్ష మార్గం దొరుకుతుంది. ఆ స్థిరమైన భక్తి మార్గంలో మనలను కుదురుగా తీసుకువెళ్ళ గలిగే వారు సద్గురువు. భక్తి అనే దారిలో చేయి పట్టి తీసుకువెళ్ళే సద్గురువు మనకందరకు దొరికి, నిశ్చలమైన భక్తి భావంతో నిరంతరం మనం భగవానుని సేవలో వుండేలా అనుగ్రహించమని కోదండపాణి ని కోటి మొక్కులతో కోరుకుంటూ .......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు