సహాయం ;-సిహెచ్.శృతి,10వ తరగతి, జడ్పీహెచ్ఎస్ ఇందిరానగర్-సెల్ నెం. 9059997558
 ఒకసారి ఒక పిల్లి చెట్టు పొదలు చిక్కుకుని బయటకి రాలేక అరుస్తోంది. మ్యావ్ మ్యావ్ అని అరుపు విని ఒక అతను దానిని చిక్కులోంచి బైటకు తీసుకురావాలని ప్రయత్నించాడు కానీ పిల్లికి అది అర్థం కాక మనిషి దగ్గరకు రాగానే చేతి మీద కొరికింది భయపడుతూ ఇంకొకతను ఇది చూసి పోనీలే అలాగే వదిలేయ్ అది జంతువు. దానికి ఎలా బయటపడాలో తెలిసి వస్తోంది అన్నాడు.
   కానీ అతను వదిలేయలేదు చిక్కులోంచి రక్షించాడు. అవును పిల్లి జంతువే, దాన్ని నైజాం దాని జోలికి వచ్చిన వాళ్లని గీరటం గాయం చేయటం. దాని లక్షణం.
        కానీ నేను మనిషిని నా నైజం జాలి, దయా, కరుణ ఉన్నాయి. మంచి చేసేటప్పుడే కొన్ని ఇబ్బందులు గలుగుతాయి అని చెప్తున్నప్పుడు పిల్లి వచ్చి వినయపూర్వకంగా అతని దగ్గర కూర్చుంది.

నీతి: ఇతరులకు సాయం చేయాలనుకోవడం

కామెంట్‌లు