నాలోని మౌనం నన్ను ప్రశ్నించింది
నువ్వు ఎవరని ?
చీకటి గుహల సామ్రాజ్యంలో
అంతు చిక్కని ప్రశ్నల సముద్రంలో
నేనెక్కడని నన్ను నేను వెతుకుంటున్నాను.
నాకు నేను కనిపించనంత
కారు చీకట్లో కమ్మివేశాయి
నాకు నేను కనిపించినప్పుడు కదా
నేనెవరిని నన్ను నేను పరిచయం చేస్తాను
ఈ చీకటి గుహల కొరల్లోకి
నిరంతరం నిషి రాత్రిలా వుండే
శూన్యంలోని వెలుతురును పంచేది ఏది ?
నాకు నా ప్రతిబింబాన్ని చూపేది ఏది?
బాహ్య నేత్రాలకు బయటకు కనిపించినంత
సులభంగా నేనెవరినో నాకు కనిపించడంలేదు
అకస్మాత్తుగా మెలుకువ నాకు వచ్చింది
అజ్ఞానం అనే అంధకారాన్ని విజ్ఞానం
అనే గ్యానం చీకటి గుహల కోరల్ని
విరిచి
నన్ను నాకు పరిచయం చేసింది
ప్రతి అడుగులో నన్ను నేను ప్రశ్నించుకుంటే
అది నాకు దారి చూపిస్తుంది
"నేనెవరిని";- _ పి. ధృవిత 10వ తరగతి Zphs Iఇందిరానగర్ సిద్దిపేట9381175601
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి