*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-( 121 )*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సంధ్య ఆత్మాహుతి - అరుంధతి గా వశిష్ఠునితో వివాహం - బ్రహ్మ శివ కళ్యాణం కొరకు శివదేవిని ఆశ్రయించుట*
*బ్రహ్మ, నారదుని ఇలా చెప్పాడు -* 
*కామదేవుడు రతీదేవిని పెళ్ళి చేసుకుని తన భవనానికి వెళ్ళాడు. దక్షుడు మిగిలినవారు కూడా వారి వారి నివాసాలకు వెళ్ళారు. సంధ్య తపస్సు చేసుకోవడానికి వెళుంది.*
*నారదా! వెనుకకు ఒకసారి నాకు మోహావేశము కలిగినది. ఆ స్థితిలో నన్ను చూచిన పరమేశ్వరుడు అపహాస్యం చేసారు. నాకు వుక్రోషము, కోపము కలిగాయి. శివుని యందు ఈర్ష్యా భావము కూడా కలుగింది. వీటన్నిటికీ శివమాయ యే కారణము. నేను దక్ష మహాముని వున్నచోటికి వెళ్ళాను. అక్కడే, రతీ, కామదేవులు కూడా వున్నారు. నేను వారిని చూచి, మీరు ఎలా అయినా సరే, పరమశివుడు ఒక అందమైన స్త్రీ ని వివాహం చేసుకునేలా చేయమని చెప్పాను. కామదేవుడు నా సహాయం కోరాడు. నా నిశ్వాసము నుండి వసంతుడు మలయానిలుడు, ఇంకా మారగణములు (మన్మధుని గణములు) పుట్టాయి. వీరందరితో కూడి మన్మధుడు శివుని మోహింప చేయడానికి వెళ్ళాడు. కానీ, నిర్గుణుడు, నిర్వికారుడు, మనసును స్వాధీనమలో వుంచుకున్న శివుని, మన్మధుడు అతని పరివారం ఏమీ చేయలేక పోతాయి.*
*అప్పుడు ఎలాగైనా శివుని మోహంలో పడేయాలని, నా తండ్రి గురించి తపస్సు చేసాను. నాలుగు చేతులలో శంఖు, చక్ర, గదా, పద్మాలతో, బంగారు వస్త్రము ధరించి నాపై కరుణతో నా ముందు ప్రత్యక్షమై, నన్ను ఎందుకు తలచుకున్నావు. నీ కోరిక ఏమిటి అని అడిగాడు, నా తండ్రి. అప్పుడు, తండ్రీ, పరమశివుడు ఏదో ఒక రకంగా వివాహం చేసుకుని పత్నిని స్వీకరించితే గానీ, నా మనసులో బాధ పోదు. అందుకు తగిన ఉపాయము చెప్ప వలసినది అనిబాడిగాను.
*నాకోరిక విన్న నా తండ్రి, నాకు ఈ విధంగా కర్తవ్య బోధ చేసారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు