కవిసమ్రాట్ విశ్వనాథ వారు (3) ;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఆకాశవాణిలో ఓ సంప్రదాయం ఉంది  పెద్దవారు చనిపోయినప్పుడు వారికి  శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం చేస్తాం బహుముఖ ప్రజ్ఞాశాలి  మా గ్రామం దగ్గర ఉన్న సిరి వాడలో  వేలూరి శివరామ శాస్త్రి గారు మరణించిన రోజున విశ్వనాథ వారి దగ్గరకు వెళ్లి వారి గురించి చెప్పమన్నాం వాడి గురించి చెప్పేదేముంటుంది  రా వాడు ఏమైనా  తిరుపతి వెంకటకవుల శిష్యుడా అని ఆక్షేపిస్తూ మాట్లాడారు. నా ప్రక్కనే ఉన్న ఉషశ్రీ గారు మీరు చెప్పిన మాట నేను రికార్డ్ చేస్తాను అదే చెప్పండి అన్నాడు. అదేమిట్రా తప్పదా  అని చాప మీద పద్మాసనం వేసుకుని కూర్చుని  దాదాపు ఎనిమిది నిముషాలు అనర్గళంగా చెప్పారు. శాస్త్రి గారు 18 భాషలు నేర్చుకోవడానికి కీలకమైన విషయం వారి అబ్బాయి ఒక ఆంగ్లేయుణ్ణి తీసుకు వచ్చి వీరు మా నాన్నగారు  సంస్కృత పండితులు అని పరిచయం చేస్తే హౌ ఆర్ యు ఓల్డ్ మాన్ అన్నారాయన.   ఏమిట్రా తను మాట్లాడుతోంది అంటే మీరు ఎలా ఉన్నారు అని చెప్పాడు బాగానే ఉన్నాను నేను సమాధానం చెప్పి అతను వెళ్లేటప్పుడు  ఇవాళ సోమవారం మళ్లీ సోమవారం రమ్మని వాడితో కూడా చెప్పరా అన్నాడు కొడుకుతో ఆ రాత్రి కొడుకు దగ్గర శంకర్ నారాయణ నిఘంటువు తీసుకొని  ఆదివారం తిరిగి ఇచ్చేసి  ఆంగ్లేయుడు వచ్చేసరికి  ఆంగ్లంలోనే మాట్లాడుతూ  ఆహ్వానం పలికి అతను మాట్లాడే భాషలో వ్యాకరణ దోషాలు ఎత్తి చూపించిన ఘనుడు. వేలూరి శివరామ శాస్త్రి గారు. తంత్ర శాస్త్రంలో  వారు అద్భుతమైన గ్రంథాలను  వ్రాసి  ఉంచిన వ్రాతప్రతులు  దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదంలో కాలిపోయిన క్షణాన వైరాగ్యం ఆవహించింది. మళ్లీ కలం చేత పట్టలేదు నిజంగా ఆయన రాసినవి ఉంటే మరిన్ని అద్భుతాలు జరిగి ఉండేవి. అనుకోకుండా మరణించడం వల్ల ఆంధ్ర దేశానికి జరిగిన  అన్యాయం ఇంతా అంతా అని చెప్పలేము. అక్షరం అంటే  వేలూరి, వేలూరి అంటే  అక్షరం అన్నట్లుగా జీవించారు.  వారి కుటుంబానికి నా సంతాపాన్ని తెలియ చేస్తూ వారికి నివాళులు అర్పించారు.  ఇంత జ్ఞానాన్ని సముపార్జించిన గొప్ప వారికి కూడా ఏదో ఒక లోపం ఉంటుందని మా గురువు గారు ఉషశ్రీ గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. గొప్ప వారందరూ నూటికి నూరుపాళ్ళు కాదు  వారిలోనూ కొన్ని చెడు గుణాలు ఉంటాయి  దుర్మార్గులు, హంతకులు అనుకున్న వారిలో కూడా కొన్ని సుగుణాలు ఉంటాయి  అన్నది మా గురువుగారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు  కవిసమ్రాట్ లో తమ గురువుగారి పై భక్తి పెరిగి  వారి శిష్యులు కాని వారిని  కవిగా అంగీకరించని లోపం  ఒక్కటే ఆయనకు కనిపించని మచ్చ ఆ ఒక్కటి తప్ప ఆయన లో  ఏ దోషము లేదని ఉషశ్రీ గారి చెబుతుంటారు.

కామెంట్‌లు