కవిసమ్రాట్ విశ్వనాథవారు (5)-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 విజయవాడ ఎస్.ఆర్.ఆర్ కళాశాలలో  విశ్వనాథ సత్యనారాయణ గారు  వారు రచించిన వేయిపడగలు  నవల పాఠం చెబుతున్నారు  ఒక అమ్మాయి ఆలస్యంగా వచ్చింది పుస్తకం తీసుకు రాలేదు ఏమే పుస్తకం ఏది అని అడిగారు తీసుకురాలేదని వినయంగా సమాధానం చెప్పింది. ఇవాళ రెండు కిలోల పుస్తకం మోయలేని దానివి రేపు 60 కిలోల బరువు ఎలా మోయగలవు అనగానే ఆ అమ్మాయి అన్న ఏమిటి మాస్టారు అలా మాట్లాడుతారు  క్లాస్ లో బూతులు మాట్లాడడం ఏమిటి  అనగానే నీకెందుకు కూర్చోరా లంజ కొడకా అన్నారు. వెంటనే ఆ కుర్రవాడు ప్రిన్సిపాల్ నక్కా రామారావు గారికి జరిగిన విషయం చెబితే ఆయన తిన్నగా క్లాసుకు వచ్చి ఏమిటి మాట్లాడారు తప్పు గదా అనగానే  ఏం జరిగింది రా 
తప్పు అని అడిగాడు విశ్వనాథ వారు. అమ్మాయిని తిట్టారు కదా అంటే అమ్మాయి ని కాదురా అబ్బాయిని  ఏమన్నానట  అంటే విషయం చెప్పారు  అది తిట్టు ఎలా అవుతుంది రా బూతు పదం కాదు వాడిని ఆశీర్వదించాను "లం" అంటే నీరు లేక భూమి "జ" అంటే పుట్టడం  సరస్వతీ పుత్రుడు అని దీవించాను.  అనగానే ప్రిన్సిపాల్ అదేమిటి  అలా సమర్థించుకుంటారు చేసిన తప్పు పెద్దరికంగా ఒప్పుకోవాలి కదా అనగానే
భాష తెలియని వాడివి  కళాశాల సంచాలకుడిగా ఎలా వచ్చావురా  నేను అన్నది కాదు  కవికుల తిలకుడు కాళిదాస్ అన్నాడు కవిర్ధండి కవిర్ధండి  భవ భూతిశ్య  పండితః అనగానే రండా అని సంబోధించాడు అంటే లంజ  తర్వాత వికటకవి తెనాలి రామలింగడు లంజలకొడకా ఎక్కడ  కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ అని వాడాడు కాళిదాసు ఏకవచనంలో వాడితే  వీడు బహువచనం లక్ష్మీ- సరస్వతి ని కలిపి చెప్పిన పద్యం. ఈ మధ్యలో నీకు తెలిసిన శ్రీశ్రీ రాశాడు దొంగ లంజ కొడుకులసలే మసలే  ఈ లోకంలో అంటూ, ఇతను  లక్ష్మిని అంటే డబ్బులు దొచుకున్న (నల్ల ధనం)  కుబేరుల గురించి మాట్లాడాడు  ఇవేవీ నీకు తెలియవు  ఊరికే మాటలు మాత్రం మాట్లాడడం.  బూతు అంటే తెలియదు  ఎవడైనా బూతు చేస్తాడు తప్ప మాట్లాడతాడా? కానీ నీకు తెలుగు రాదు ముందు తెలుగు నేర్చుకోండి ఆంధ్ర భాషా జ్ఞానం ఉన్న వాడు ఎవడైనా సరే ప్రపంచం మొత్తాన్ని పరిపాలించ గల  సమర్థుడు. వారి భాషా జ్ఞానాన్ని అభినందించాలా  ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మన ఆంధ్ర భాష గొప్పతనం తెలుస్తుంది  ఏ అక్షరంలోనూ తప్పులేదు  మనం చూసే దృష్టి తప్ప అన్న విషయం చాలా స్పష్టం చేశారు విశ్వనాథవారు. అందుకు వారికి కృతజ్ఞతలు.

కామెంట్‌లు